యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ మనోజ్ సోని రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన పదవీకాలం 2029తో ముగియనుండగా ఐదేళ్ల ముందుగానే తప్పుకున్నారు. కొందరు అభ్యర్థులు యూపీఎస్సీకి ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగాలు సాధించడం, ఈ క్రమంలోనే మనోజ్ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.