AP: రాష్ట్రంలో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఏప్రిల్ 2న కనిగిరిలో సీబీజీ తొలి యూనిట్ కు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, మంత్రి లోకేశ్ శంకుస్థాపన చేస్తారన్నారు. త్వరలోనే మార్కాపురం, గిద్దలూరు, దర్శిలోనూ ఈ ప్లాంట్లు ప్రారంభిస్తామని చెప్పారు. ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వ భూమికి ఎకరానికి రూ.15వేలు, ప్రైవేట్ భూమికి రూ.31వేల కౌలు అందిస్తామని పేర్కొన్నారు.