ఏపీపై కేంద్రం వరాల జల్లు కురిపిస్తోంది. తాజాగా రేణిగుంట నుంచి సీఆర్ఎస్ నగర్ మధ్య కొత్త రైల్వే లైను నిర్మించడానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. రేణిగుంటలో రోజురోజుకు రైళ్ల రాకపోకలు తీవ్రంగా పెరుగుతుండటంతో విపరీతమైన రద్దీ నెలకొంది. రైళ్ల మరమ్మతుల కోసం సీఆర్ఎస్‌కు తీసుకువెళ్లడానికి కుదరనంత రద్దీ ఉంటుంది. దీంతో కొత్త రైల్వే లైన్ నిర్మించాలని అధికారులు భావించారు. సీబీఐడీ కాలనీ వద్ద గూడ్స్ షెడ్డు ఏర్పాటు చేయనుండటంతో ఈ పనులకు కేంద్రం రూ.25 కోట్లు విడుదల చేసింది.