ఉండవల్లిలోని
టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో చండీయాగం, సుదర్శన నారసింహ హోమాల్ని శుక్రవారం నిర్వహించారు. గుంటూరుకు చెందిన వేదపండితులు శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో 40 మంది రుత్వికులు... చంద్రబాబు, భువనేశ్వరి దంపతులతో ప్రత్యేక పూజలు చేయించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలకు మేలు జరగాలని చంద్రబాబు దంపతులు ప్రార్థించారు. నేడు, రేపు ఈ యాగం కొనసాగనుంది.