చంద్రబాబు, కరువు కవల పిల్లలు: VSR

74చూసినవారు
చంద్రబాబు, కరువు కవల పిల్లలు: VSR
చంద్రబాబు, కరువు కవలలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఏపీలోని 54 మండలాలను కరువు మండలాలుగా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనిపై ఎంపీ విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. ‘బాబు వస్తే కరువు వస్తుంది. చంద్రబాబు, కరువు కవల పిల్లలు అనేది నానుడి. ఈ ఏడాది నైరుతి అనుకూలించిన రాయలసీమలో కరువు నీడలు వెంటాడుతున్నాయి. వైసీపీ హయాంలో ఐదేళ్లపాటు ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేసింది.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్