చంద్రబాబుకి హోదా వచ్చింది.. ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందా?

593చూసినవారు
చంద్రబాబుకి హోదా వచ్చింది.. ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందా?
మొత్తానికి మాజీ సీఎం కాస్తా కొత్త సీఎం గా మారిపోయారు చంద్రబాబు. ఆయన అయిదేళ్ల పాటు విపక్షంలో గడిపారు. మొత్తానికి చంద్రబాబుకు సీఎం పోస్ట్ వచ్చింది. కానీ అదే సమయంలో ఏపీకి ఏమి న్యాయం జరిగింది అన్నది అందరి ప్రశ్నగా ఉంది. మామూలుగా అయితే ఏపీకి ప్రత్యేక హోదా అన్నది ఇపుడు వినిపించి ఉండకూడదు. కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి సొంతంగా మెజారిటీ లేదు. మరి ఇంతటి కీలక సమయంలో బాబు బీజేపీ పెద్దలను ఒప్ప్పించి ఏపీకి ప్రత్యేక హోదా తీసుకుని రావాలి కదా అన్నది అంతా అంటున్న విషయం.

సంబంధిత పోస్ట్