AP: గుంటూరులోని కిమ్స్ శిఖర ఆస్పత్రిని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు అచ్చెన్నాయుడు, దుర్గేష్, గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 200 పడకలతో అత్యాధునిక సౌకర్యాల మధ్య ఈ ఆస్పత్రిని నిర్మించారు. ఇక్కడ తల్లి, బిడ్డల సంరక్షణ కోసం కిమ్స్ కడిల్స్ సెంటర్ ను సైతం నిర్మించారు.