పురుషాధిక్య భావజాలం, స్త్రీని బానిసగా చూసే మనస్తత్వం మహిళను ఇలాగే ఉండాలంటుంది. ఈ లైంగిక దాడులకు అసాంఘిక వ్యక్తిత్వం, మద్యం డ్రగ్స్ వంటి చెడు అలవాట్లు, నిందితులకు అండగా నిలబడే నీచ రాజకీయ నాయకులు, కామాంధులను కాపాడే నేటి న్యాయ వ్యవస్థ… అన్నీ కారణాలే! స్త్రీని లైంగిక వస్తువుగా చూసినంత కాలం ఈ హింస తగ్గదు.