అభివృద్ధి చెందిన దేశాల్లో కన్నా మహిళను దేవతగా పూజించాలని చెప్పే మనదేశంలో మహిళలపై హింస, మరణాల శాతం చాలా ఎక్కువ. కట్టుబాట్లు, సాంప్రదాయం, మగవారికి ఎదురు చెప్పకూడదనే భావజాలం.. ఎంత చదువుకుని, ఉద్యోగాలు చేస్తున్నా మహిళలకైనా తప్పడం లేదు. మహిళాభివృద్ధి, సమానత్వం, సాధికారత అని నాయకులు చెబుతున్న మాటల్లోని డొల్లతనాన్ని ఇవి చాటి చెబుతున్నాయి.