ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, అతడి భార్య సైరా భాను గతేడాది విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా వీరు తమ విడాకులను వాపస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సైరా తరఫు న్యాయవాది వెల్లడించారు. ఇటీవల సైరా భాను అనారోగ్యానికి గురి కాగా, రెహమాన్ దగ్గరుండి చూసుకున్నారని, మనస్పర్థలు తొలగిపోవడంతో విడిపోవాలన్న నిర్ణయాన్ని కూడా విరమించుకున్నట్లు తెలిపారు.