నేడు ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు

61చూసినవారు
నేడు ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు
అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌కు శనివారం సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా చంద్రబాబు పార్టీ కార్యాలయానికి రానున్నారు. ఈ మేరకు చంద్రబాబును ఘన స్వాగతం పలికేందుకు పార్టీ కార్యాలయ వర్గాలు ఏర్పాట్లు చేశారు. ఇకపై తరచూ పార్టీ కార్యాలయానికి వెళ్లేలా చంద్రబాబు ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం. పార్టీ-ప్రభుత్వం సమన్వయానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్