రేపు కూటమి ఎమ్మెల్యేలతో చంద్రబాబు భేటీ

77చూసినవారు
రేపు కూటమి ఎమ్మెల్యేలతో చంద్రబాబు భేటీ
సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేలతో టీడీపీ అధినేత చంద్రబాబు మంగళవారం భేటీ కానున్నట్లు సమాచారం. చంద్రబాబు నివాసంలో లేదా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో కూటమి తరఫున శాసనసభా పక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకోనున్నారు. అనంతరం తీర్మానం ప్రతిని కూటమి బృందం గవర్నర్‌ను కలిసి అందజేయనుంది.

సంబంధిత పోస్ట్