ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు

79చూసినవారు
ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు
ఏపీలో మరికొద్ది గంటల్లో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఏపీ సీఎంగా నాల్గొవ సారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం ఉదయం 11.27 నిమిషాలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎంగా చంద్రబాబుతో పాటు మరికొందరు మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి దేశ ప్రధాని మోదీ,కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, జేపీ నడ్డా, బండి సంజయ్, మెగాస్టార్ చిరంజీవి, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

సంబంధిత పోస్ట్