మలవిసర్జన చేస్తున్న వ్యక్తిపై పులి దాడి.. తర్వాత ఏమైందంటే? (Video)

84చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లా పిలిభిత్ టైగర్ రిజర్వ్ పరిధిలోని నగరియా కాట్ ప్రాంతంలో సోమవారం ఒక వ్యక్తి బహిరంగ ప్రాంతంలో మలవిసర్జన చేస్తుండగా పులి దాడి చేసింది. అతడ్ని తీవ్రంగా గాయపర్చింది. కాగా, ఆ వ్యక్తిపై పులి దాడి చేయడం చూసి అక్కడున్న గ్రామస్తులు భయాందోళన చెందారు. తొలుత వారంతా అక్కడి నుంచి దూరంగా పరుగులు తీశారు. అనంతరం ధైర్యం చేసిన గ్రామస్తులు ఆ పులిని తరిమారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

సంబంధిత పోస్ట్