రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ కు తీవ్రగాయాలు
చంద్రగిరి మండల పరిధిలోని తొండవాడ దగ్గర ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విధులు ముగించుకుని బైక్ పై తిరుపతికి వెళుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ హిదయతుల్లాను ఆటో ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన మరో కానిస్టేబుల్ చిరంజీవి 108కు ఫోన్ చేయగా వారు స్పందించలేదన్నారు. దీంతో బాధిత కానిస్టేబుల్ ను ఆటోలో ఆసుపత్రికి తరలించారు. మరో వైపు బైక్ ను ఢీకొట్టిన ఆటో డ్రైవర్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.