చిత్తూరు జిల్లా ఎస్పీ క్యాంప్ ఆఫీస్ నందు గురువారం ఉదయం ఘనంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు. అనంతరం పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా, పోలీసు సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా ఎస్పీ సతీమణి హర్షిత
పాల్గొన్నారు.