అంబరాన్ని అంటిన గణేష్ నిమజ్జన కార్యక్రమం

51చూసినవారు
కార్వేటినగరం మండల కేంద్రం శివాలయం వీధిలో హైదరాబాద్ తరహాలో అత్యంత వైభవంగా గణేష్ నిమజ్జన ఊరేగింపు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. విగ్రహాలను కార్వేటినగరం కేంద్రంలో పురవీధులలో పోలీస్ బందోబస్తు నడుమ ఆదివారం ఊరేగింపు కొనసాగింది. ప్రతి విగ్రహం ముందు రంగురంగుల విద్యుత్ దీపాలు, డీజే సౌండ్ తో యువత చిందులేస్తూ వైభవంగా ఊరేగించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు గణేష్ నిమజ్జన ఉత్సవంలో పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you