ఎమ్మెల్యే థామస్ కు స్వాగతం పలికిన ఎస్ఆర్ పురం నేతలు

51చూసినవారు
గంగాధర నెల్లూరు ఎమ్మెల్యేగా గెలుపొంది మొట్టమొదటిసారిగా ఎస్ఆర్ పురం మండలానికి విచ్చేసిన ఎమ్మెల్యే డాక్టర్ థామస్ కు ఆదివారం టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అనంతరం పలువురు నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పుష్పగుచ్చంతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జయశంకర్ నాయుడు, నిరంజన్ రెడ్డి, గుండయ్య, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్