పురుగుల మందు తాగి ఇద్దరు మృతి
చిత్తూరు జిల్లా, రామకుప్పం మండల పరిధిలోని గోవిందపల్లె సమీపంలో శాంతిపురం మండలానికి చెందిన రామచంద్ర, అనంతపురం జిల్లాకు చెందిన శోభ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం జరిగింది. ఇద్దరిని కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా వారు మార్గమధ్యలో మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.