కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని అడిషనల్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా కుటుంబ సమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ ఈవో పెంచల కిషోర్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చి ఆలయ తీర్థప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.