పూతలపట్టు: రైతుల సమస్యలను పరిష్కరించాలి
పూతలపట్టు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రైతు సంఘం నాయకుడు మునిరత్నం నాయుడు డిమాండ్ చేశారు. తవణంపల్లి తహశీల్దార్ సుధాకర్ కు సోమవారం వినతి పత్రానికి సమర్పించారు. తహశీల్దార్ మాట్లాడుతూ ఏడాదికి రైతుకు రూ. 20 వేలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకంతో కలిపి రూ. 7 వేలు ఇస్తామని చెప్పడం దారుణమని అన్నారు. అన్నదాతలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.