మండలం లో ఓ మోస్తరుగా వర్షం

70చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలో ఆదివారం రాత్రి ఓ మోస్తరుగా వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రతకు గ్రామాల్లోని ప్రజలు తట్టుకోలేకపోయారు. రోజురోజుకు పగటి పూట ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతుండడంతో ఉక్కపోతతొ ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షంతో వాతావరణం చల్లబడింది. ఉరుములు మెరుపులు వచ్చేటప్పుడు ఎత్తైన చెట్ల కింద ఉండకూడదని వైద్యాధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్