చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణానికి చెందిన ఏపీజే అబ్దుల్ కలాం సభ్యులు అయుబ్ ఖాన్ వినూత్న రీతిలో తన దేశభక్తిని చాటుకున్నారు. గురువారం ఉదయం పట్టణ సమీపంలోని ఓ బావిలో జాతీయ జెండా తడవకుండా ఆయుబ్ ఖాన్ బృందం ఈత కొట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము ఈ విన్యాసాన్ని గత మూడు సంవత్సరాలుగా చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం, రామప్ప, సందీప్ తదితరులు పాల్గొన్నారు.