రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌లో ఓ ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యం పోలీసుల ప్రాణాల మీదకు తెచ్చింది. ఓ ట్రక్కు డ్రైవర్ వాహనాన్ని వేగంగా నడుపుతూ ముందు వెళ్తున్న వాహనాలను ఢీ కొట్టాడు. ఢీ కొట్టిన వాహనాలలో పోలీసుల వాహనం కూడా ఉండడంతో ఈ ప్రమాదంలో ఓ మహిళా కానిస్టేబుల్‌తో పాటు మరో ముగ్గురికి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు కాగా వైరల్‌గా మారాయి.