రామసముద్రం మండల తహశీల్దార్ శ్రీనివాసులు శనివారం అనంతపురం జిల్లాకు బదిలీ కావడంతో, బదిలీపై వెళ్తున్న తహసిల్దార్ కు రెవిన్యూ సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా తహసిల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతూ విధి నిర్వహణలో తోటి ఉద్యోగులు చేసిన సేవలను గుర్తు చేశారు. ప్రజలకు సేవలు అందించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాహశీల్దార్ శ్రీనివాసరావు, ఆర్ఐ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.