ఏఆర్‌ డెయిరీ ఎండీ బెయిలు పిటిషన్‌పై విచారణను అక్టోబర్ 17కి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు

82చూసినవారు
ఏఆర్‌ డెయిరీ ఎండీ బెయిలు పిటిషన్‌పై విచారణను అక్టోబర్ 17కి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు
ఏఆర్‌ డెయిరీ ఎండీ ఆర్‌.రాజశేఖరన్‌ బెయిలు పిటిషన్‌పై తదుపరి విచారణను అక్టోబర్ 17కి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యిని సరఫరా చేశామనే ఆరోపణలతో తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని తమిళనాడుకు చెందిన ఏఆర్‌ డెయిరీ ఫుడ్స్‌ ఎండీ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. లడ్డూ వివాదంపై శుక్రవారం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన సందర్భంలో రాజశేఖరన్‌ పిటిషన్‌పై తదుపరి విచారణను హైకోర్టు వాయిదా పడింది.

సంబంధిత పోస్ట్