బీఎన్. కండ్రిగ ఏపీఎంగా మునెయ్య బాధ్యతలు
బుచ్చినాయుడు కండ్రిగ మండల వెలుగు నూతన ఏపీఎంగా మునెయ్య మంగళవారం బాధ్యతలు చేపట్టారు. సాధారణ బదిలీల్లో భాగంగా బీఎన్ కండ్రిగ ఏపీఎం ఇందిరమ్మ తొట్టంబేడు మండలానికి బదిలీ అయ్యారు. శ్రీకాళహస్తిలో పనిచేస్తున్న మునెయ్యను బుచ్చినాయుడు కండ్రిగకు బదిలీ చేశారు. ఆయన మాట్లాడుతూ. రుణాలు మంజూరు చేసి సంఘాల బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు.