TG: వనపర్తి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. గురుకుల పాఠశాలలో 7వ తరగతి విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మదనాపురం బాలుర గురుకులంలో కొన్నూరు గ్రామానికి చెందిన 7వ తరగతి విద్యార్థి ప్రవీణ్ దుప్పటితో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.