చంద్రగిరి మండలంలో మంచు దుప్పట్లు కమ్ముకుని కనువిందు చేస్తున్నాయి. ఉదయం 7 గంటలైనా మంచు వదలకపోవడంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. 200మీటర్ల దూరంలో సైతం మనుషులు కనిపించని విధంగా మంచు కప్పేయడంతో పాటు చలి తీవ్రత అధికంగా ఉంది. ఫలితంగా పిల్లలు, వృద్ధులు ఇంటికే పరిమితమయ్యారు. ఇక రహదారిపై మంచు కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.