Dec 12, 2024, 17:12 IST/
కేంద్రీయ విద్యాలయాలు కేటాయించండి: సీఎం రేవంత్
Dec 12, 2024, 17:12 IST
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణకు కేంద్రీయ విద్యాలయాలను కేటాయించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఇటీవల రాష్ట్రానికి ఏడు నవోదయ విద్యాలయాలు కేటాయించినందుకు కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ శాలువాతో సత్కరించారు. అంతేగాక రాష్ట్రానికి ఒక్క కేంద్రీయ విద్యాలయం కూడా కేటాయించలేదని, కేంద్రీయ విద్యాలయాలతో పాటు నవోదయ పాఠశాలలు లేని జిల్లాలకు వాటిని కేటాయించాలని కోరారు.