TG: అత్తమామల వేధింపులు.. కోడలు సెల్ఫీ సూసైడ్ యత్నం (VIDEO)

82చూసినవారు
హైదరాబాద్‌లో భర్త సిఖిందర్ రెడ్డి, అత్తమామల వెంకట్ రెడ్డి, స్వరూప, ఆడపడుచు ఝాన్సీ వేధింపుల కారణంగా ప్రణీత అనే మహిళా డాక్టర్ సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్యాయత్నం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదంటూ పురుగు మందు తాగారు. కర్మన్ ఘట్-జీవన్ ఆసుపత్రికి తరలించగా ప్రణీత చికిత్స పొందుతున్నారు. 2018లో సిఖిందర్ రెడ్డితో ప్రణీత వివాహం జరిగింది. ప్రస్తుతం నాంపల్లి ఏరియా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్