మహా కుంభమేళాలో ఇద్దరు వృద్ధ దంపతులను వారి కొడుకులు అక్కడే వదిలి వెళ్లిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరలవుతోంది. వీడియోలో రాత్రి సమయంలో ఓ వృద్ధ జంట చలిలో వణుకుతూ కూర్చున్నారు. ఓ వ్యక్తి ఆ వృద్ధ జంటకు కొంత డబ్బు ఇచ్చాడు. తాను ఇక్కడి నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటానని ఈ డబ్బు ఉంచుకోండి అని ఇచ్చాడు. పొద్దున్నే వచ్చి ఆశ్రమానికి తీసుకెళ్తానని హామీ ఇచ్చాడు.