ఉత్తరాఖండ్లో 38వ జాతీయ క్రీడలను ప్రధాని మోదీ ప్రారంభించారు. సుమారు 10,000 మంది అథ్లెట్లు 32 విభాగాలలో పోటీ పడేందుకు సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 14 వరకు ఈ ఆటలు కొనసాగనున్నాయి. డెహ్రాడూన్ ప్రధాన వేదికగా ఏడు నగరాల్లో స్పోర్ట్స్ ఈవెంట్లు జరగనున్నాయి. ఈ మేరకు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామితో కలిసి ప్రధాని మోదీ ఈ ఈవెంట్కు పచ్చజెండా ఊపారు.