ఉపాధ్యాయ బదిలీ చట్టంపై క్షేత్ర స్థాయిలో అభిప్రాయ సేకరణ చేపట్టనున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. స్కూళ్లలో ప్రతి శనివారం ‘నో బ్యాగ్ డే’గా పాటించాలని అధికారులను ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. బ్యాగ్ లేకుండానే ఆరోజు స్కూలు జరిగేలా కో కరిక్యులమ్ యాక్టివిటీస్ రూపొందించాలన్నారు. టీచర్లకు ఒకటే యాప్‌ను రిలీజ్ చేస్తామని చెప్పారు. జీవో 117 ఉపసంహరణపై అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపుతామని తెలిపారు.