చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నగరంలోని 42, 43 వార్డులో మంగళవారం పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి దుర్గ చౌదరి ఆధ్వర్యంలో పెన్షన్ పంపిణీ చేశారు. దుర్గ చౌదరి మాట్లాడుతూ పెన్షన్ పంపిణీ చేయడంలో ఏపీ ప్రభుత్వం ముందుందని అన్నారు. ఒకటవ తేదీ వాలంటీర్లు లేకుండానే పెన్షన్ లబ్ధిదారులకు ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ ఇవ్వడంతో వారి సంతోషానికి అవధులు లేవని అన్నారు.