చిత్తూరు: ల్యాబ్ టెక్నీషియన్ లతో సమీక్ష

65చూసినవారు
చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఓ ప్రభావతి దేవి ఆదేశాలతో.. ఉపవైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకట్ ప్రసాద్, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ అనిల్ కుమార్ సంయుక్త ఆధ్వర్యంలో ల్యాబ్ టెక్నీషియన్లకు సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. డాక్టర్ వెంకట ప్రసాద్ మాట్లాడుతూ.. 10 పర్సెంట్ ఓపీలో తప్పనిసరిగా టిబి పరీక్షలు చేయాలన్నారు. అలాగే పిహెచ్సి నందు ప్రతి ఆశ కార్యకర్త ప్రతివారం గల్ల పరీక్ష కిట్ల ద్వారా అనుమానిత కేసుల నుంచి గళ్ళ సేకరించి పిహెచ్సీ నందు పరీక్షించాలన్నారు.

సంబంధిత పోస్ట్