ఈ నెల 26వ తేదీలోపు 10వ తరగతి పరీక్ష రుసుమును చెల్లించాలని సోమవారం డీఈఓ వరలక్ష్మి సోమవారం తెలిపారు. అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ నెల 26వ తేదీ లోపు పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల రుసుమును చెల్లించాలన్నారు. అపరాధ రుసుము రూ. 50 తో కలిపి డిసెంబర్ రెండవ తేదీ లోపల చెల్లించాలన్నారు. అపరాధ రుసుము రూ. 200 తో కలిపి డిసెంబర్ 9వ తేదీ లోపల, అపరాధ రుసుము రూ. 500 డిసెంబర్ 16 లోపు చెల్లించాలన్నారు.