కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి విమర్శించారు. ఈ సందర్భంగా జీడి నెల్లూరులో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మంగళవారం మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలు ఒంటరిగా తిరిగే పరిస్థితి లేదన్నారు. వడమాలపేట, ఎర్రావారిపాలెం, పుంగనూరు ప్రాంతాల్లో జరిగిన ఆకృత్యాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో మహిళల రక్షణ కోసం దిశ యాప్ తీసుకువచ్చారని గుర్తు చేశారు.