Oct 07, 2024, 17:10 IST/వేములవాడ
వేములవాడ
భజన కార్యక్రమం నిర్వహించిన భక్తజనం
Oct 07, 2024, 17:10 IST
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని సుభాష్ నగర్ (లెవన్ టైగర్స్ యూత్) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దుర్గామాత వద్ద సోమవారం రాత్రి మల్లారం రామ భజన బృందం భజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భజన కీర్తనలతో అమ్మవారి మండపం మార్మోగింది. అధిక సంఖ్యలో భక్తులు భజన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి సేవలో తరించారు.