Dec 19, 2024, 01:12 IST/
వణికిస్తోన్న చలి.. ఇవాళ, రేపు జాగ్రత్త
Dec 19, 2024, 01:12 IST
తెలంగాణలో చలి తీవ్రరూపం దాల్చుతోంది. అన్ని జిల్లాల్లో సాధారణం కంటే 3 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు వణుకుతున్నారు. ఆసిఫాబాద్(D) సిర్పూర్ (U)లో రాష్ట్రంలోనే అతి తక్కువగా 5.9 డిగ్రీలు, HYDలో 11.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 2 రోజుల్లో చలితీవ్రత మరింత పెరుగుతుందని హెచ్చరించారు. వృద్ధులు, చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.