దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన నీట్ యూజీ 2024 పేపర్ లీక్ కేసులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి సీబీఐ గత వారం మూడో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ వ్యవహారంలో మొత్తంగా 144 మంది అభ్యర్థులు డబ్బులు చెల్లించినట్లు తేల్చింది. పరీక్ష జరగడానికి కొద్ది గంటల ముందే ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌లోని ఒయాసిస్ స్కూల్ నుంచి పంకజ్ కుమార్ అనే వ్యక్తి చేతుల మీదుగా నీట్ ప్రశ్నాపత్రం లీకైనట్లు సీబీఐ గుర్తించింది.