May 08, 2024, 14:05 IST/మంథని
మంథని
కౌంటింగ్ సెంటర్లలో ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్
May 08, 2024, 14:05 IST
ఈవిఎం యంత్రాల తరలింపుకు స్ట్రాంగ్ రూమ్ లను సిద్ధం చేయాలని, కౌంటింగ్ కోసం ఏర్పాట్లు చేయాలని పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. బుధవారం రామగిరిలోని సెంటినరీ కాలనీ జేఎన్టీయూ కళాశాలను అదనపు కలెక్టర్లు అరుణశ్రీ, శ్యామ్ ప్రసాద్ లాల్, అదనపు కలెక్టర్ దివాకరలతో కలిసి పరిశీలించారు. ఈకార్యక్రమంలో సహాయ రిటర్నింగ్ అధికారులు హనుమనాయక్, గంగయ్య పాల్గొన్నారు.