ఇండోనేషియాలో మరోసారి పేలిన అగ్నిపర్వతం

61చూసినవారు
ఇండోనేషియాలో మరోసారి పేలిన అగ్నిపర్వతం
ఇండోనేషియాలో వరుస అగ్నిపర్వతాల పేలుళ్లు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా బుధవారం తూర్పు ఇండోనేషియాలోని ఒక అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. ఉత్తర మలుకు ప్రావిన్స్‌లోని హల్మహెరా ద్వీపంలో ఉన్న మౌంట్ ఇబు పర్వతం ఉదయం 11 గంటలకు విస్ఫోటనం చెందింది. దీంతో భారీగా బూడిద ఆకాశాన్ని కమ్మేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రెండవ అత్యధిక స్థాయి హెచ్చరికను జారీ చేశారు.

సంబంధిత పోస్ట్