కుప్పంలో టీడీపీ సంబరాలు

1105చూసినవారు
కుప్పం టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలలో కూటమి అభ్యర్థులు భారీ ఆధిక్యతతో దూసుకుపోతుండటంతో చంద్రబాబు సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు. మిఠాయిలు పంచుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ శ్రేణులు మొత్తం టీడీపీ కార్యాలయానికి చేరుకుంటున్నారు.