కెవిబిపురంలో రేపు సర్వసభ్య సమావేశం
కెవిబిపురం మండల పరిషత్ కార్యాలయంలో శనివారం సాధారణ సర్వసభ్య సమావేశం జరుగుతుందని ఎంపీపీ ముందు లక్ష్మీ శుక్రవారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఈ కార్యక్రమానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరుకావాలని చెప్పారు.