విజయవాడలో జనవరి 5వ తేదీన జరగనున్న హైందవ శంఖారావం బహిరంగ సభను జయప్రదం చేయాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ పిలుపునిచ్చారు. మదనపల్లి సొసైటీ కాలనీ రామాలయం వీధిలో గురువారం ఆర్ఎస్ఎస్ రాష్ట్ర కార్యవాహ వేణుగోపాల్ నాయుడు, అన్నమయ్య జిల్లా కార్యవాహ భాను ప్రకాష్, మదనపల్లి కార్యవాహ దుర్గా ప్రసాద్ కరపత్రాలను ఆవిష్కరించి సభను జయప్రదం చేయాలని కోరారు.