భర్త విడాకులిచ్చి మోసం చేయగా, పిన తండ్రి, పినతల్లి తనకు రాసిచ్చిన ఇంటిస్థలం ఖాజేసి మోసం చేశారని మదనపల్లి ప్రశాంత్ నగర్లోని రెండవ వీధిలో మోసం చేసిన వారి ఇంటి ముందు సీటీఎం చిన్నయాన చెరువుపల్లికి చెందిన బాధితురాలు ఎరుకల రెడ్డి భార్య జే. ఈశ్వరమ్మ(45) పెట్రోల్ పోసుకొని గురువారం నిరసన చేసింది. న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుని చనిపోతానని ఆవేదన వ్యక్తం చేసింది. ఘటనపై టూటౌన్ పోలీసులు విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు.