ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

1249చూసినవారు
ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు
నగరి నియోజకవర్గం నిండ్ర మండలం కూనమరాజుపాలెం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానం నందు ఆదివారం కార్తీక పౌర్ణమి పూజలు ఘనంగా జరిగాయి. శ్రీమహాలక్ష్మీ అమ్మవారికి ఉదయం అభిషేకం నిర్వహించి అనంతరం అమ్మవారిని వివిధ రకాల పుష్పాలు, పట్టువస్త్రాలతో అలంకరించి లోకకల్యాణార్ధం ఉభయదారులతో లక్ష్మినారాయణ హోమం నిర్వహించారు. పూర్ణాహుతి అనంతరం అమ్మవారికి పంచ హారతులతో నివేదన చేసి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్