తిరుపతి - చెన్నై జాతీయ రహదారి పాదిరేడు వద్ద తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. రాత్రివేళల్లో రోడ్డు దాటడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లైట్లు ఏర్పాటు చేయాలని పాదిరేడు పరిసర గ్రామ ప్రజలు నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ దృష్టికి తెచ్చారు. హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేసి ప్రమాదాలు నివారించాలని ఎమ్మెల్యే ఎన్ హెచ్, విద్యుత్ అధికారులను ఆదేశించారు.