చిత్తూరు జిల్లా నగరి మండలంలోని కీళ్లపట్టు-కుశస్థలి నది బ్రిడ్జిని కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే భాను ప్రకాశ్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా తరచూ వర్షాలకు దెబ్బతింటున్న వంతెనకు శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కొత్త వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు పాల్గొన్నారు.